![]() |
![]() |

అప్పుడు కార్తీకదీపం సీరియల్ ప్రసారమయ్యే టైం స్లాట్ లో ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ ప్రసారమవుతుంది. ఇప్పుడు ఈ సీరియల్ విశేషంగా వీక్షకాదరణను పొందుతూ వస్తోంది. రాజ్ కి కావ్య అంటే ద్వేషం.. కావ్యకి రాజ్ అంటే పడదు. ఇలా ఇద్దరు తూర్పు పడమరలా ఉంటున్నారు. అయితే తాజాగా బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో స్వప్న పెళ్ళి మండపం నుండి రాహుల్ తో వెళ్ళిపోయింది.
పెళ్ళిపీటల మీద రాజ్ ఉన్నాడు. ఇప్పటిదాకా అనుకుంటున్న పెళ్ళికూతురు స్వప్న వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది అనే ట్విస్ట్ తో సినిమా రేంజ్ ఇంటర్వెల్ లా ప్లాన్ చేసారు ఈ సీరియల్ మేకర్స్ . కాగా తాజాగా ఈ సీరియల్ డైరెక్టర్ చింటు పంతం తను కావ్య(దీపికా రంగరాజు)తో కలిసి దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. అయితే ఈ ఫోటోలో కావ్య పెళ్ళికూతురిలా రెడీ అయింది. తలమీద జీలకర్రబెల్లంతో, మెడలో పూలమాలతో పెళ్ళికూతురులా ఉండటంతో రాజ్ తో పెళ్ళి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే కావ్యతో పెళ్ళికి రాజ్ ఫ్యామీలీ ఎలా ఒప్పుకుంది? కావ్యని ఎలా ఒప్పించారనే ట్విస్ట్ ఇప్పుడు అందరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాగా గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ లో మొదటినుండి కావ్య, రాజ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టముండదు అలాంటిది ఎలా పెళ్ళి చేసుకోగలిగారు? అసలు కావ్య రాజ్ నే పెళ్ళిచేసుకుందా? అనే క్యూరియాసిటి ఇప్పుడు వీక్షకులలో నెలకొంది. అయితే ఈ ట్విస్ట్ ఏంటో తెలియాంటే 'బ్రహ్మముడి' చూడాల్సిందే!
![]() |
![]() |